వి చిత్రం పై నాని సరికొత్త వీడియో…రేపు ఏం చెప్పనున్నారు!?

Wednesday, August 19th, 2020, 09:58:43 PM IST

V Nani Movie
మోహన కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వం లో తెరకెక్కిన వి చిత్రం విడుదల గురించి రోజురోజుకీ సోషల్ మీడియా లో వార్తలు ఎక్కువగా వస్తున్నాయి. సినిమా ఆన్లైన్ ద్వారా విడుదల కానుంది అని ఇప్పటికే వార్తలు రాగా, తాజాగా ఈ చిత్రానికి సంబంధించి నేచురల్ స్టార్ నాని ఒక వీడియో ను సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేశారు. వి చిత్రానికి సంబంధించిన అనౌన్స్ మెంట్ ను సిద్దం చేసినట్లు చెప్పుకొచ్చారు.

అయితే వీడియో లో ఏముంది అంటే, సినిమా ధియేటర్ ఇంటికి రాకపోయినా, ధియేటర్ ఎక్స్ పీరియన్స్ మాత్రం ఇంటికి రానుంది అని నాని అన్నారు. మళ్లీ మిడ్ నైట్ షోస్ పడబోతున్నయి అని అన్నారు. అంతేకాక సినిమా విడుదలకు ముందు ఉండే టెన్షన్, ఆందోళన మిస్ అయినట్లు తెలిపారు. అంతేకాక మీరు కూడా అలానే మిస్ అయి ఉంటారు అని అన్నారు. అందుకే వి చిత్రం అనౌన్స్ మెంట్ రేపు ఉంది అని అన్నారు. అయితే రేపు నాని ఏం చెప్పబోతున్నాడు అనే దాని పట్ల అభిమానులు, ప్రేక్షకులు ఎంతగానో ఆసక్తి గా ఎదురు చూస్తున్నారు.