పుష్ప సినిమాలో నందమూరి హీరో.. కధ మలుపు తిప్పే పాత్ర..!

Sunday, September 6th, 2020, 01:08:03 AM IST

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, రష్మికా మందన్నా హీరోయిన్‌గా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పుష్ప సినిమాలో నందమూరి హీరో ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు తెలుస్తుంది. అల వైకుంఠపురం సినిమాలో అక్కినేని హీరో సుశాంత్‌తో కలిసి నటించిన బన్నీ, ఇప్పుడు పుష్పలో నారా వారబ్బాయి నారా రోహిత్‌తో కలిసి నటించబోతున్నాడు.

ఒకప్పుడు వరస సినిమాలు చేసిన నారా రోహిత్ గత కొద్ది రోజులుగా సినిమాలు చేయడం లేదు. అయితే ఇప్పుడు పుష్ప సినిమాతో ఆయన రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారని, ఇప్పటికే దర్శక నిర్మాతలు ఆయనతో సంప్రదింపులు కూడా జరిపినట్టు టాక్ వినిపిస్తుంది. అయితే ఈ సినిమాలో నారా రోహిత్, బన్నీల మధ్య వచ్చే సన్నివేశాలు హైలెట్‌గా నిలుస్తాయని, కథను మలుపు తిప్పే పాత్రలో నారా రోహిత్ నటించబోతున్నట్టు తెలుస్తుంది. ఇదే నిజమైతే కనుక ఈ సినిమాలోని తన పాత్రతో నారా రోహిత్ అభిమానులను మళ్ళీ మెప్పించగలుగుతాడా లేదా అనేది చూడాలి మరీ.