జయ ప్రకాష్ రెడ్డి కుటుంబానికి పది లక్షలు ఇచ్చిన నందమూరి బాలకృష్ణ

Wednesday, September 9th, 2020, 01:57:04 AM IST


నటుడు, కమెడియన్ జయ ప్రకాష్ రెడ్డి మృతి సినీ ప్రముఖులను, రాజకీయ నాయకులను, అభిమానులను దిగ్భ్రాంతి కి గురి చేసింది. అయితే ఎన్నో సినిమాల్లో తనదైన బాణీ తో అలరించిన జయ ప్రకాష్ రెడ్డి మరణం పట్ల ఇప్పటికే అభిమానులు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు. అయితే తాజాగా నందమూరి బాలకృష్ణ జయ ప్రకాష్ రెడ్డి కుటుంబానికి పదిలక్షల రూపాయలు ఇచ్చినట్లు తెలుస్తోంది. నందమూరి బాలకృష్ణ హీరోగా మాత్రమే కాకుండా, నిజ జీవితంలో కూడా ఎన్నో మంచి పనులను చేస్తున్న సంగతి తెలిసిందే. రాయలసీమ యాస ను తనదైన శైలిలో డైలాగ్స్ తో అదరగొట్టే జయ ప్రకాష్ రెడ్డి బాలయ్య సినిమాల్లో ఎక్కువగా విలన్ పాత్రలో నటించారు.