రాంగోపాల్ వర్మకు షాక్.. మర్డర్ సినిమా విడుదలపై మధ్యంతర ఉత్తర్వులు..!

Monday, August 24th, 2020, 03:53:33 PM IST

వివాదస్పద సినిమాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు షాక్ తగిలింది. నల్గొండ జిల్లా మిర్యాలగూడ ప్రణయ్, అమృతల ప్రేమ కథ ఆధారంగా ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారని, ఈ సినిమా ప్రణయ్ హత్యకేసును ప్రభావితం చేసే అవకాశం ఉందని ప్రణయ్ తల్లుదండ్రులు నల్గొండ జిల్లా శ్ఛ్,శ్ట్ కోర్టును ఆశ్రయించారు.

దీంతో ఇప్పటికే వర్మపై పోలీస్ కేసు కూడా నమోదయ్యింది. అయితే తాజాగా రాంగోపాల్ వర్మ మర్డర్ సినిమా విడుదలకు బ్రేక్ పడింది. ఈ సినిమా విడుదలను నిలిపివేస్తూ నల్గొండ ఎస్సీ, ఎస్టీ కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఇప్పట్లో మర్డర్ సినిమా రిలీజ్ అయ్యే అవకాశాలు మాత్రం లేవనే చెప్పాలి.