బిగ్‌బాస్ సీజన్ 4లో నాగ్ లుక్ వైరైటీగా ప్లాన్ చేశారా?

Thursday, August 13th, 2020, 11:05:42 AM IST

బిగ్‌బాస్ సీజన్ 4 ఈ నెలాఖరు నుంచి బుల్లితెర ప్రేక్షకులకు ఫుల్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ అందించేందుకు రెడీ అవుతుంది. అయితే బిగ్‌బాస్ సీజన్ 3లో హోస్ట్‌గా యంగ్ లుక్‌లో అదరగొట్టిన నాగ్ ఈ సారి ఓల్డ్ మాన్ లుక్‌లో కనిపించబోతున్నట్టు తెలుస్తుంది.

అయితే తాజాగా సీజన్ 4 కి సంబంధించిన ఓ ప్రోమో రిలీజ్ చేశారు నిర్వాహకులు. ఇందులో నాగ్ తెల్లటి జుట్టుతో ముసలి వాడి గెటప్‌తో కనిపించి అందరికి షాక్ ఇచ్చారు. అంతేకాదు చిన్న బైనోక్లర్ వంటి పరికరంతో ఎక్కడో చూసి వెక్కిలి నవ్వుతో గోపీ అంటూ పిలిచాడు. అయితే సీజన్‌ 3లో పండు అంటూ ఒక కోతి బొమ్మను నాగ్ వేలుకు పెట్టుకొని దానికి అనేక విషయాలు షేర్ చేస్తూ ఉండేవాడు. అయితే ఈ సీజన్ మొత్తం నాగ్ ఇదే ఓల్డ్ మాన్ గెటప్‌లో కనిపిస్తాడా లేక కేవలం ప్రోమోకి మాత్రమే అలా కొత్తగా ప్లాన్ చేశారా? అసలు నాగ్ పిలిచిన ఆ గోపీ ఎవరు?అనేది ఇప్పుడు బిగ్‌బాస్ ప్రేక్షకులలో మెదులుతున్న ప్రశ్న.