నా దృష్టిలో ట్రెండ్ సెట్టర్ అంటే మీరే కృష్ణ గారు – నాగబాబు!

Sunday, May 31st, 2020, 02:45:43 PM IST

నటుడు, జనసేన నాయకుడు కొణిదెల నాగబాబు అలనాటి సూపర్ స్టార్ కృష్ణ గారి పై పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. కృష్ణ పుట్టిన రోజు సందర్భంగా ఇప్పటికే పలువురు ప్రముఖులు, రాజకీయ నాయకులు, అభిమానులు కృష్ణ గారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అయితే కొణిదెల నాగబాబు మాత్రం చాలా వినూత్నంగా, విభిన్నంగా సూపర్ స్టార్ అభిమానులను రంజింప చేసేలా విషెస్ తెలియ జేశారు.

నాకు నచ్చిన అతి హీరోలలో ఒకరైన కృష్ణ గారు పుట్టిన రోజు ఈరోజు అని వ్యాఖ్యానించారు. అయితే ఈ పుట్టిన రోజు సందర్భంగా కొన్ని విషయాలను పంచుకోవాలని భావిస్తున్నాను అని వ్యాఖ్యానించారు.మెగాస్టార్ చిరంజీవి శకం కంటే ముందుగా తెలుగు చిత్త పరిశ్రమకి నాలుగు పిల్లర్లు గా అక్కినేని నాగేశ్వర రావు, నందమూరి తారక రామారావు, శోభన్ బాబు, సూపర్ స్టార్ కృష్ణ గారు ఉన్నారు అని వ్యాఖ్యానించారు.

అయితే నా దృష్టిలో మాత్రం ట్రెండ్ సెట్టర్ అంటే కృష్ణ గారు అని నాగబాబు అన్నారు. అందరికంటే ముందుగా టెక్నాలజీ నీ కృష్ణ గారు వాడుకున్నారు అని అన్నారు. మొదటి 70 ఎం ఎం సినిమా, మొదటి డిటి ఎస్ సినిమా, మొదటి సినిమా స్కోప్, మొదటి ఈస్ట్ మన్ కలర్ సినిమా, మొదటి గూఢచారి సినిమా కృష్ణ గారు చేసినవే అని వ్యాఖ్యానించారు.ఇవి మాత్రమే కాక, మీరు ఒక గొప్ప మానవతా వాది అని అన్నారు. ఆఫ్ స్క్రీన్ లో ఎంతోమంది కి సహాయం చేశారు అని నాగబాబు అన్నారు.అంతేకాక హ్యాపీ బర్త్ డే సూపర్ స్టార్ కృష్ణ గారు అంటూ ఒక హాష్ ట్యాగ్ నీ జత చేశారు.