సోషల్ మీడియా లోకి స్వాగతం – అన్నయకి అండగా నాగబాబు

Tuesday, March 24th, 2020, 08:37:30 PM IST

నిత్యం సోషల్ మీడియా లో ఆక్టివ్ గా ఉండే ప్రముఖ నటుడు, నిర్మాత నాగబాబు నేడు సామాజిక మాంద్యమాల ద్వారా కొన్ని ఆసక్తికరమైన వాఖ్యలు చేశారు. కాగా ప్రముఖ నటుడు మెగాస్టార్ చిరంజీవి రేపటి నుండి సోషల్ మీడియాలోకి వస్తున్నట్లు ప్రకటించిన సంగతి మనకు తెలిసిందే. అయితే ఈ విషయంలో చిరంజీవి సోదరుడు, నాగబాబు స్పందిస్తూ… “అన్నయ్య తాజాగా సోషల్ మీడియా లోకి వస్తున్నట్టు ప్రకటించడం అనేది తనకు చాలా సంతోషంగా ఉందని, అన్నయ్య ఇప్పుడు సామాజిక మాంద్యమాల ద్వారా ప్రజలందరినీ కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయడానికి అన్నయ్య తీసుకున్న నిర్ణయం హర్షించదగ్గ విషయమని నాగబాబు వాఖ్యానించారు.

అంతేకాకుండా అయితే అన్నయ్య తీసుకున్న నిర్ణయం అనేది ప్రజలందరిపై ఖచ్చితంగా మంచి ప్రభావాన్ని చూపిస్తుందని, ప్రజలందరూ కూడా అన్నయ్య మాట వింటారనే నమ్మకం ఉందని వెల్లడించిన ఆయన, అన్నయ్య చిరంజీవి సోషల్ మీడియా లోకి రావడాన్ని హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నానంటూ ట్విట్టర్ వేదిక ద్వారా నాగబాబు ఒక పోస్టు చేశారు. దానికి తోడు అన్నయ్య చిరంజీవి మాట్లాడిన ఒక వీడియో ని కూడా జతపరిచారు….