ఆమె నాకో బెస్ట్ ఫ్రెండ్… ఎమోషనల్ అయిన నాగబాబు

Sunday, January 24th, 2021, 09:44:57 PM IST

మెగా డాటర్ నీహారిక పెళ్లి తో నాగబాబు తన బాధ్యత తీసుకున్నారు. అయితే ఇటీవల నీహారిక ను జొన్నలగడ్డ చైతన్య కి ఇచ్చి పెళ్లి చేసారు నాగబాబు. ఐదు రోజుల పాటుగా జరిగిన పెళ్లి కి సంబంధించిన వీడియో లు, ఫోటోలు సైతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే ఇటీవల ఒక ఇంటర్వ్యూ లో పాల్గొన్న నాగబాబు, నీహారిక పెళ్లి గురించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. అదే క్రమం లో భావోద్వేగానికి గురయ్యారు.

ఆడపిల్లలు అంటే చాలా ఇష్టం అని, ఈ సృష్టికి మహిళలే మూలం అని నాగబాబు చెప్పుకొచ్చారు. అందుకే మహిళల పై గౌరవం అని, వరుణ్ పుట్టిన తర్వాత కూతురు పుడితే బావుండేది అని అనుకున్నా అని నాగబాబు అన్నారు. అలాగే నీహారిక జన్మించింది అని, నిహారిక అంటే తనకెంతో ఇష్టం అని నాగబాబు పేర్కొన్నారు. ఆమె నాకు బెస్ట్ ఫ్రెండ్ అంటూ భావోద్వేగానికి లోనయ్యారు. అయితే తనకు సంబంధించిన అన్ని విషయాలు నీహారిక తోనే పంచుకొనే వాడిని అని అన్నారు. మా ఇద్దరి మధ్య మాటల్లో చెప్పలేని అనుభందం ఉందని, కాకపోతే పెళ్లి అయ్యాక మాటలు తగ్గాయి అని నాగబాబు అన్నారు.