ప్రభాస్ కొత్త సినిమా పై నాగ్ అశ్విన్ ఆసక్తికర వ్యాఖ్యలు

Wednesday, August 19th, 2020, 01:10:12 AM IST

టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ కాస్త పాన్ ఇండియన్ స్టార్ గా మారారు ప్రభాస్. బాహుబలి చిత్రం తో పాన్ ఇండియన్ స్టార్ గా ఎదిగిన ప్రభాస్ ఆ చిత్రం నుండి అన్ని భారీ చిత్రాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. అయితే ప్రభాస్ రాధే శ్యామ్, నాగ్ అశ్విన్ తో చిత్రాలు చేస్తున్నారు. తాజాగా ఓం రౌత్ తో మరొక భారీ చిత్రాన్ని చేసేందుకు సిద్దం అయ్యారు. ఆది పురుష్ అనే టైటిల్ తోనే అదరగొట్టిన ప్రభాస్ చిత్రం పై దర్శకుడు నాగ్ అశ్విన్ పలు ఆసక్తి కర వ్యాఖ్యలు చేశారు.

ప్రభాస్ ను రాముడు గెటప్ లో చూసేందుకు చాలా ఆతృత గా ఎదురు చూస్తున్నట్లు తెలిపారు. చాలా తక్కువ మంది నటులు మాత్రమే రాముడు పాత్రను బిగ్ స్క్రీన్ పై పోషించారు అని నాగ్ అశ్విన్ అన్నారు. ఈ నేపధ్యంలో ఆది పురుష్ చిత్ర యూనిట్ కి గుడ్ లక్ అంటూ తెలిపారు నాగ్ అశ్విన్. అయితే ఆది పురుష్ లో ప్రభాస్ రాముడు గా నటిస్తున్నట్లు హింట్ ఇవ్వడం తో అభిమానులు సంతోషం తో పండగ చేసుకుంటున్నారు. ప్రభాస్ ఒక్కోక్క జోనర్ లో సినిమా లు చేస్తూ అటు అభిమానులను, ఇటు ప్రేక్షకులను అందరినీ అలరిస్తున్నారు.