హాట్ టాపిక్: ప్రభాస్ ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ తెప్పించే న్యూస్..!

Wednesday, July 8th, 2020, 09:14:24 PM IST

ప్రభాస్ పేరు వింటేనే ఇపుడు యూత్ లో ఒక వైబ్రేషన్ మొదలవుతుంది. బాహుబలి సిరీస్ చిత్రాలతో పాన్ ఇండియన్ స్టార్ గా మారిపోయారు ప్రభాస్. ఏ హీరో కి సాధ్యం కానీ తరహాలో బిగ్గెస్ట్ రికార్డ్ లను నెలకొల్పారు. ఇప్పటికీ నాన్ బాహుబలి రికార్డ్స్ అంటూ ప్రభాస్ నామం ను జపం చేస్తున్నారు ఫిల్మ్ క్రిటిక్స్. అయితే తాజాగా దర్శకుడు నాగ్ అశ్విన్, ప్రభాస్ తో చేయబోయే సినిమా గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇపుడు అవి కాస్త సోషల్ మీడియా లో హల్చల్ చేస్తున్నాయి.

అయితే ప్రభాస్ తో సైన్స్ ఫిక్షన్ సినిమా చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు నాగ్ అశ్విన్. అయితే ఈ సినిమా స్క్రిప్ట్ ను 2007 లో నే రాసినట్లుగా నాగ్ అశ్విన్ చెప్పుకొచ్చారు. గత 10 సంవత్సరాలుగా ఈ స్క్రిప్ట్ ను చేంజ్ చేస్తూనే ఉన్నా అని వ్యాఖ్యానించారు. అంతేకాక ఈ చిత్రం కోసం ప్రత్యేకంగా VFX నేర్చుకునట్లు తెలిపారు. ఈ కథ కోసమే తాను దర్శకుడు అవ్వాలి అని అనుకున్నారు అట. ఈ విషయాన్ని తాజాగా నాగ్ అశ్విన్ చెప్పుకొచ్చారు. అయితే ఈ విషయం తెలిసిన తర్వాత నుండి ప్రభాస్ అభిమానులు తెగ సంబర పడిపోతున్నారు.