రాజమౌళి తీస్తున్న RRR సినిమాను అడ్డుకుంటాం – ఎంపీ సోయం బాపురావు

Tuesday, October 27th, 2020, 10:00:45 AM IST

దర్శకుడు రాజమౌళి రౌద్రం రణం రుదిరం చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం లో కుమురం భీమ్ పాత్రలో జూనియర్ ఎన్టీఆర్ నటిస్తుండగా, అల్లూరి సీతారామరాజు పాత్ర లో రామ్ చరణ్ నటిస్తున్నారు. అయితే రాజమౌళి వీరికి సంబంధించిన టీజర్ కట్స్ ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇటీవల విడుదల అయిన రామరాజు ఫర్ భీమ్ టీజర్ వివాదాస్పదం గా మారింది. ఈ టీజర్ లో జూనియర్ ఎన్టీఆర్ కుమురమ్ భీమ్ పాత్రలో కనిపించగా, చివరగా ముస్లిం వేషధారణలో రాజమౌళి తీర్చి దిద్దారు. అయితే ఈ విషయం పై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అయితే ఆదివాసీల పోరాట యోధులు అయిన కుమురం భీమ్ మరియు అల్లూరి సీతారామరాజు ల పై దర్శకుడు రాజమౌళి తీస్తున్న RRR ను అడ్డుకుంటాం అని అదిలాబాద్ ఎంపీ సొయం బాపూరావు అన్నారు. భీమ్ వర్ధంతి సభకు హజరు అయిన బాపురావ్, పలు కీలక వ్యాఖ్యలు చేశారు. భీమ్ నైజాం సర్కారు తో పోరాటం చేసి అమరుడైన విషయాన్ని గుర్తు చేశారు. అయితే ఆయన స్ఫూర్తితో తీస్తున్న సినిమాలో ఆయన పాత్రకి ముస్లిం వేషధారణ వేయడం ఆదివాసీల మనోభావాలను పూర్తిగా దెబ్బ తీసే విధంగా ఉంది అని తెలిపారు. అంతేకాక రాష్ట్ర ప్రభుత్వం ఆదివాసీల పై ప్రవర్తిస్తున్న తీరుకి నిరసన గా డిసెంబర్ 9 న ఏటూరు నాగారం లో లక్ష మందితో సభను ఏర్పాటు చేస్తామని తెలిపారు.