లేటెస్ట్ బజ్ : “కేజీయఫ్ చాప్టర్ 2” కి రిలీజ్ డేట్ ఫిక్సయ్యిందా..?

Tuesday, August 4th, 2020, 06:21:06 PM IST

KGF_chapter2

ఇప్పుడు మన దేశంలోనే మోస్ట్ ప్రిస్టేజియస్ సినిమాలలో “కేజీయఫ్ చాప్టర్ 2” కూడా ఒకటి. కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ఈ భారీ చిత్రంపై ఎన్ని అంచనాలు ఉన్నాయి ఎలాంటి అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పుకొనక్కర్లేదు. అయితే ఇప్పుడు పరిస్థితులు అన్ని బాగున్నట్టైతే ఇంకొక్క రెండు నెలల్లో థియేటర్స్ లో బ్రహ్మోత్సవం జరిగి ఉండేది. కానీ కరోనా దెబ్బకు అన్ని కొలాప్స్ అయ్యిపోయాయి. దీనితో అన్ని సినిమాలు ఆగిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఇదిలా ఉండగా ఇప్పుడు ఈ సినిమాకు ఒక సరికొత్త రిలీజ్ డేట్ వచ్చినట్టు తెలుస్తుంది. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చెయ్యాలని చిత్ర యూనిట్ భావిస్తున్నారట. వచ్చే 2021 సంక్రాంతి కానుకగా జనవరి 14 న ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే సంక్రాంతి బరిలో చాలానే భారీ సినిమాలు ఉన్నాయి. ఇక ఇదే కనుక నిజం అయితే అప్పుడు పరిస్థితులు ఊహకందని రేంజ్ లో ఉంటాయని చెప్పాలి.