బెస్ట్ ఆఫ్ లక్ మై డియర్ ఫ్రెండ్ – మోహన్ బాబు

Saturday, August 22nd, 2020, 05:50:13 PM IST

మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా అభిమానులతో పాటుగా, సినీ ప్రముఖులు సైతం భారీగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అయితే తాజాగా నటుడు మోహన్ బాబు మెగాస్టార్ చిరంజీవి కి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.

చిరంజీవి నాకు మంచి మిత్రుడు, అతని పేరులోనే ఉంది చిరంజీవి అంటే ఆంజనేయ స్వామి. అంటే ఎల్లకాలము చిరంజీవి వై వర్దిల్లుగాక. అంటే నిండు నూరేళ్ళు ఉత్సాహం గా కుటుంబ సభ్యుల తో పుట్టిన రోజు జరుపుకోవాలని ఆ షిరిడీ సాయినాథున్ని కోరుకుంటున్నాను. బెస్ట్ ఆఫ్ లక్ మై డియర్ ఫ్రెండ్ చిరంజీవి అంటూ మోహన్ బాబు ట్వీట్ చేసారు.

ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి కి అల్లు అర్జున్, వరుణ్ తేజ్, అల్లు శిరీష్, రవి తేజ లతో పాటుగా ప్రముఖ హీరోలు, దర్శకులు చిరు కి శుభాకాంక్షలు తెలిపారు.