మహేష్ గత సినిమాలతో ఊహించని యాదృచ్చికం..ఓ లుక్కేయండి!

Sunday, May 31st, 2020, 01:04:12 PM IST

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తాజాగా నటిస్తున్న చిత్రం “సర్కారు వారి పాట” ఈరోజు మహేష్ తండ్రి కృష్ణ గారి పుట్టిన రోజు సందర్భంగా కన్ఫర్మ్ అయ్యిపోయింది. దీనితో సోషల్ మీడియాలోమహేష్ ఫ్యాన్స్ రచ్చ షురూ చేసారు.

దీనికి ముందు మహేష్ నటించిన మూడు సినిమాలతో ఒకదాని మించిన మరొక బ్లాక్ బస్టర్ అందుకొని బ్లాక్ బస్టర్ హ్యాట్రిక్ ను మహేష్ సొంతం చేసుకున్నారు. ఇప్పుడు సర్కారు వారి పాట తో మరో హ్యాట్రిక్ మొదలు కానుంది అని మహేష్ ట్వీట్ చేసారు.

అయితే ఈ సినిమాతో మహేష్ నటించిన మూడు సినిమాలకు ఒక ఊహించని యాదృచ్చికం నమోదు అయ్యింది. ఈ “సర్కారు వారి పాట”, “సరిలేరు నీకెవ్వరు”, “మహర్షి” అలాగే “భరత్ అనే నేను” ఈ నాలుగు సినిమాలు వరుసగా మహేష్ నటించనున్న నటించిన సినిమాలు.

అయితే ఈ సినిమాల మొదటి ఆంగ్ల అక్షరాలను చూసినట్లయితే “ఎస్ ఎస్ ఎం బి” వస్తున్నాయి. అంటే “సూపర్ స్టార్ మహేష్ బాబు” అని వచ్చింది. ఇలా మహేష్ గత సినిమాలుతో కలిపి భలే యాదృచ్చికంగా తన పేరు వచ్చింది. ఇప్పుడు ఈ అంశమే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది.