ఏప్రిల్ 8…ఈ తారీఖు తో నాకు బోలెడంత అనుబంధం ఉంది – మెగాస్టార్ చిరంజీవి

Monday, April 6th, 2020, 06:47:21 PM IST


మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా లోకి వచ్చినప్పటి నుండి తన అభిమానులను ఎంతగానో అలరిస్తున్నారు. అంతేకాకుండా కరోనా వైరస్ పై తనదైన రీతిలో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. అయితే తాజాగా సోషల్ మీడియా ద్వారా మెగాస్టార్ చిరంజీవి ఒక ఆసక్తి కరమైన పోస్ట్ ఒకటి చేశారు. ఏప్రిల్ 8 అని చెబుతూ, ఆ తారీఖు తో నాకు బోలెడంత అనుబంధం ఉంది అని మెగాస్టార్ చిరంజీవి వ్యాఖ్యానించారు. అయితే ఇది సశేషం, ఇంకా మిగిలివుంది అంటూ తెలిపారు. అయితే చిరు చేసిన ఈ వ్యాఖ్యల పై నెటిజన్లు స్పందిస్తున్నారు.

అల్లు అర్జున్ పుట్టిన రోజు ఏప్రిల్ 8 కావడం గమనార్హం. అయితే ఈ తేదీకి సంబంధించి ఏదో ఒక విషయాన్ని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు చిరు. అయితే ఇప్పటికే అల్లు అర్జున్ అభిమానులు కోత చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదల ఎపుడు అంటూ కామెంట్లు చేస్తున్న విషయం తెలిసిందే. చిత్ర యూనిట్ ఆ పనిలోనే ఉన్నట్లు తెలుస్తోంది. మరి చిరు తన అనుబంధం గురించి ఏం చెబుతారో తెలియాలి అంటే వేచి చూడాల్సిందే.