ఎన్టీఆర్ గారికి భారతరత్న ఇస్తే అది తెలుగువారికి గర్వకారణం – మెగాస్టార్ చిరంజీవి

Friday, May 28th, 2021, 01:01:23 PM IST

నందమూరి తారక రామారావు జయంతి కావడం తో అభిమానులు, ప్రముఖులు శ్రేయోభిలాషులు పెద్ద ఎత్తున నివాళులు అర్పిస్తూ, శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఎన్టీఆర్ ఘన కీర్తీ నీ ప్రపంచ వ్యాప్తంగా కొనియాడుతున్నారు. అయితే సినీ పరిశ్రమ లో నట సార్వభౌమ గా ఎదిగిన ఎన్టీఆర్ రాజకీయాల్లో కూడా తనదైన ప్రత్యేకత చాటుకున్నారు. అయితే ఎన్టీఆర్ క భారత రత్న ఇవ్వాలి అంటూ తెలుగు ప్రజలు ఎప్పటి నుండో కేంద్రాన్ని కొరుతూనే ఉన్నారు. అయితే మరొకసారి మెగాస్టార్ చిరంజీవి ఎన్టీఆర్ కి భారత రత్న ఇవ్వాలి అంటూ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.

అయితే ప్రముఖ గాయకులు నవయుగ వైతాళికులు భూపేన్ హజారికా గారికి మరణానంతరం భారత రత్న ఇచ్చినట్లు, మన తెలుగు తేజం, దేశం గర్వించే నాయకుడు నందమూరి తారక రామారావు గారికి భారత రత్న ఇస్తే తెలుగు వారందరికీ గర్వకారణం అంటూ చెప్పుకొచ్చారు. వారి నూరవ జన్మదినం దగ్గర పడుతున్న సందర్భంగా ఎన్టీఆర్ గారికి ఈ గౌరవం దక్కితే అది తెలుగు వారికి దక్కే గౌరవం అంటూ చెప్పుకొచ్చారు. ఆ మహానుభావుడి 98 వ జన్మదినం సందర్భంగా వారిని స్మరించుకుంటూ నమసీస్సులు తెలిపారు చిరంజీవి.