సాహసానికి మారుపేరు… కృష్ణగారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన చిరు!

Monday, May 31st, 2021, 05:08:36 PM IST


సూపర్ స్టార్ కృష్ణ గారి పుట్టిన రోజు సందర్భంగా తెలుగు చిత్ర పరిశ్రమ కి చెందిన ప్రముఖులు, రాజకీయ నాయకులు, అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అయితే ఈ నేపథ్యం లో మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు జరుపుకుంటున్న కృష్ణ గారికి శుభాకాంక్షలు తెలిపారు. సాహసానికి మారుపేరు అని, మల్లెపూవు లాంటి మనిషి సూపర్ స్టార్ కృష్ణ గారికి జన్మదిన శుభాకాంక్షలు అంటూ చెప్పుకొచ్చారు. సంపూర్ణ ఆయురారోగ్యాలతో నిందు నూరేళ్ళు వారు సంతోషంగా ఉండాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నా అంటూ చిరు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. హ్యాపీ బర్త్ డే సర్ అంటూ చెప్పుకొచ్చారు. అయితే మెగాస్టార్ చిరంజీవి చేసిన ట్వీట్ కి అటు మెగా అభిమానులు, ఇటు సూపర్ స్టార్ అభిమానులు స్పందిస్తున్నారు. లైక్స్ కొడుతూ షేర్ చేస్తూ, శుభాకాంక్షలు తెలుపుతున్నారు.