బిగ్ అప్డేట్: మెగస్టార్ చిరంజీవికి కరోనా పాజిటివ్..!

Monday, November 9th, 2020, 11:31:47 AM IST

కరోనా మహమ్మారి ప్రభావం ఇంకా తగ్గలేదు. ప్రతి నిత్యం సామాన్య ప్రజలతో పాటు ప్రముఖులు, సెలబ్రెటీలు కరోనా బారిన పడుతూనే ఉన్నారు. అయితే తాజాగా మెగస్టార్ చిరంజీవికి కూడా కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయనే సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఆచార్య షూటింగ్ ప్రారంభించే క్రమంలో కరోనా పరీక్షలు చేయించుకోగా పాజిటివ్ అని తేలిందని చెప్పుకొచ్చారు. అయితే ప్రస్తుతం తనకు ఎలాంటి కరోనా లక్షణాలు లేవని, అయినప్పటికి వెంటనే హోమ్ క్వారంటైన్ అయ్యానని తెలిపారు. అయితే గత 4-5 రోజులుగా తనను కలిసి వారు టెస్ట్ చేయించుకోవాలని కోరారు. ఇక ఎప్పటికప్పుడు తన ఆరోగ్య పరిస్థితి గురుంచి తెలియచేస్తూ ఉంటానని అభిమానులకు భరసా ఇచ్చారు. ఇదిలా ఉంటే ఈ రోజు నుంచి ఆచార్య షూటింగ్ తిరిగి ప్రారంభం కావల్సి ఉండగా చిరంజీవి కరోనా బారిన పడడంతో మళ్ళీ షూటింగ్ వాయిదా పడింది.