మెగా అభిమానులకు గుడ్‌న్యూస్.. చిరంజీవికి కరోనా లేదట..!

Friday, November 13th, 2020, 02:07:11 AM IST

మెగస్టార్ చిరంజీవి ఇటీవల ఆచార్య షూటింగ్ నేపధ్యంలో కరోనా టెస్ట్ చేయించుకోగా నెగిటివ్ రావడంతో తెలుగు సినీ పరిశ్రమ ఒక్కసారిగా షాక్‌కు గురయ్యింది. ఆయన త్వరగా కోలుకోవాలంటూ పలువురు అభిమానులు పూజలు కూడా చేశారు. అయితే అసలు తనకు కరోనా సోకలేదని తాజాగా ఆయనే వెల్లడించడంతో మెగాభిమానులు అంతా ఊపిరి పీల్చుకున్నారు. గత నాలుగు రోజులుగా కరోనా నన్ను ఆడేసుకుందని, ఆదివారం టెస్ట్‌లో పాజిటివ్ వచ్చిన తర్వాత బేసిక్ మెడికేషన్ ప్రారంభించానని చెప్పుకొచ్చారు.

అయితే రెండు రోజులైనా తనకు ఎలాంటి లక్షణాలు కనిపించకపోవడంతో అనుమానం వచ్చి అపోలో డాక్టర్స్‌ను సంప్రదించినట్టు తెలిపారు. అక్కడ CT స్కాన్ చేయడంతో చెస్ట్‌లో ఎలాంటి ట్రేసెస్ లేవన్నట్టు డాక్టర్లు నిర్ధారణకు వచ్చారు. అక్కడ రిజల్ట్ నెగిటివ్ వచ్చిందని, మరోసారి టెనెత్ ల్యాబ్‌లో మూడు రకాల కిట్స్‌తో టెస్ట్ చేయించానని అక్కడ కూడా నెగిటివ్ అనే వచ్చిందని తెలిపాడు. ఫైనల్‌గా ఆదివారం తనకు పాజిటివ్ రిపోర్ట్ ఇచ్చిన ఋట్ ఫ్ఛృ టెస్ట్ చేయించానని అక్కడ కూడా నెగిటివ్ వచ్చిందని, ఈ మూడు రిపోర్టుల తర్వాత మొదటి రిపోర్ట్ ఫాల్టీ కిట్ వలన వచ్చిందని డాక్టర్లు నిర్ధారణకు వచ్చినట్టు తెలిపారు. ఈ సమయంలో మీరందరూ చూపించిన ప్రేమాభిమానాలు, తన ఆరోగ్యం మెరుగు పడాలంటూ చేసిన పూజలకు, ప్రార్దనలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నట్టు ట్వీట్ చేశాడు.