మెగాస్టార్ చిరంజీవి తీసిన మొదటి ఫోటో ఇదేనట…ఎవరో చూడండి!

Wednesday, August 19th, 2020, 06:01:32 PM IST

నేడు ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం కావడం తో కొందరు తీసిన ఫొటోలను పోస్ట్ చేస్తూ సోషల్ మీడియా లో హల్చల్ చేస్తున్నారు. ప్రముఖులు, సినీ నటులు, రాజకీయ నాయకులు కొందరు ఇలా పోస్ట్ చేస్తున్నారు. అయితే నేడు మెగాస్టార్ చిరంజీవి సైతం ఒక ఫోటో ను షేర్ చేశారు. అంతేకాక తాను తీసిన మొదటి ఫోటో అంటూ దానికి క్యాప్షన్ కూడా ఇచ్చారు చిరంజీవి. ఈ అయిదుగురి లో ఒక వ్యక్తి మీకు బాగా తెలుసు, ఎవరో చెప్పుకోండి చూద్దాం అంటూ చిరు పోస్ట్ చేసిన ఫోటో కొద్ది సేపటికే సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

అయితే ఆ అయిదుగురు లో మద్య లో ఉన్నది నేటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.పవన్ కళ్యాణ్ చిన్ననాటి ఫోటో చిరు షేర్ చేయడంతో నెటిజన్లు స్పందిస్తున్నారు. నెటిజన్లు సైతం పవన్ కళ్యాణ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ అభిమానులు మాత్రం పసివాడు పవన్ కళ్యాణ్ అయ్యారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఆ ఫోటో ఎంటో మీరు ఓ లుక్కేయండి.