సతీసమేతంగా దర్శకులు విశ్వనాథ్‌ను కలిసిన చిరంజీవి..!

Sunday, November 15th, 2020, 01:46:28 AM IST

తెలుగు సినిమా స్థాయిని ఉన్నత శిఖరాలకు చేర్చి, తన సినిమాలతో ఎన్నో జాతీయ అవార్డులు అందుకున్న ప్రముఖ దర్శకుడు విశ్వనాథ్ గారిని మెగస్టార్ చిరంజీవి సతీసమేతంగా కలిశారు. కాసేపు ఇద్దరు తమ మధుర జ్ఞాపకాలను, అప్పటి సినిమా విశేషాలను గురుంచి మాట్లాడుకున్నారు. అనంతరం విశ్వనాథ్ గారి ఆరోగ్య క్షేమాలను గురుంచి చిరంజీవి అడిగి తెలుసుకున్నారు.

అయితే ఈ సందర్భంగా మెగస్టార్ చిరంజీవి మాట్లాడుతూ దీపావళి రోజున విశ్వ‌నాథ్ గారిని క‌ల‌వాల‌నిపించి నేడు ఆయన ఇంటికి వచ్చానని, ప్రస్తుతం తాను ఈ స్థాయిలో ఉండడానికి ఆయన కూడా ఓ కారణమని చెప్పుకొచ్చారు. ఆయ‌న సినిమాలు నాకు ఎన్నో అవార్డులు తెచ్చి పెట్టాయని, ఈ దీపావ‌ళి సంద‌ర్భంగా ఆయ‌న్ని క‌ల‌వ‌డం నాకు చాలా సంతోషంగా ఉందని అన్నారు. అయితే వారిద్దరి కలయిక అటు చిరు అభిమానుల్లోనూ, విశ్వనాధ్ గారి అభిమానుల్లోనూ దీపావళీ సంతోషాన్ని మరింత రెట్టింపు చేసింది.