ఉగాది న పలకరించిన మెగాస్టార్ – ఏమంటున్నారంటే…?

Wednesday, March 25th, 2020, 01:44:39 PM IST

నేడు తెలుగు నూతన సంవత్సరాది “శర్వారీ” నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు చెబుతూ మొదటగా మెగాస్టార్ చిరంజీవి గారు “చిరంజీవి కొణిదెల” అనే పేరుతొ తన అధికారిక ట్విట్టర్‌ ఖాతా ప్రారంభించారు. దానితో పాటే చిరంజీవి ఇంస్టాగ్రామ్ ఖాతా కూడా తెరిచారు. ఈ నేపథ్యంలో చిరంజీవి తన అధికారిక ట్విట్టర్ వేదిక ద్వారా రెండు పోస్టులు చేశారు. కాగా “అందరికీ శార్వరి నామ ఉగాది శుభాకాంక్షలు” అని తెలుపుతూనే, కరోనా వ్యాపిస్తున్న కారణంగా ప్రజలందరూ కూడా తీసుకోవాల్సిన జాగ్రత్తలు అన్ని చెబుతూ ఒక ట్వీట్ కూడా చేశారు చిరంజీవి. ఈ మేరకు సదరు ప్రముఖ హీరోలందరూ కూడా చిరంజీవికి స్వాగతం పలుకుతున్నారు.

అయితే మెగాస్టార్ చిరంజీవి చేసిన తొలి ట్వీట్ ని రీట్వీట్ చేస్తూ మన తెలుగు హీరోలు కొందరు మెగాస్టార్ చిరంజీవికి స్వాగతం పలుకుతూ పోస్టు చేశారు. ఈ మేరకు టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున తన అధికారిక ట్విట్టర్ వేదిక ద్వారా “ఆయన చెప్పే మాటలు ఈ విపత్కర పరిస్థితుల్లో చాలా మందికి మార్గదర్శకాలుగా నిలుస్తాయని” అక్కినేని నాగార్జున పేర్కొన్నారు. నాగార్జున తో పాటే మరికొందరు నటులు కూడా చిరంజీవి చేసిన పోస్టుకి ప్రశంసలు తెలుపుతున్నారు.