మెగస్టార్ చిరంజీవికి అస్వస్థత.. నిలిచిపోయిన ఆచార్య షూటింగ్..!

Tuesday, March 9th, 2021, 10:12:45 PM IST


ప్రస్తుతం ఆచార్య సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్న మెగాస్టార్ చిరంజీవి స్వల్ఫ అస్వస్థతకు గురైనట్టు తెలుస్తుంది. ఇల్లందు బొగ్గు గనుల్లో మూడు రోజులుగా ఆచార్య సినిమా క్లైమాక్స్ షూటింగ్ జరుగుతుంది. అయితే వేసవి ఇంకా పూర్తిస్థాయిలో మొదలవ్వక ముందే ఎండలు మండిపోతున్నాయి. ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో రికార్డు స్థాయిలో ఊష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.

దీంతో అక్కడే షూటింగ్ చేస్తున్న ఆచార్య టీంకు సమ్మర్ సెగలు తగిలాయి. అధిక వేడి కారణంగా చిరంజీవి డీహైడ్రేషన్‌‌కు గురయ్యారు. ఈ కారణంతో ఏడు రోజుల షెడ్యూల్‌తో షూటింగ్ జరుపుతుండగా, మూడ్రోజుల్లోనే షూటింగ్‌ను ముగించి చిత్ర యూనిట్‌ ప్యాకప్ చెప్పేసి హైదరాబాద్ రిటర్న్ అయ్యింది. అయితే పరిస్థితులు కాస్త చక్కబడిన తర్వాత మళ్లీ షూటింగ్ కొనసాగించాలని చిత్ర యూనిట్ భావిస్తున్నట్టు తెలుస్తుంది.