అల్లు రామలింగయ్య జయంతి రోజున చిరు భావోద్వేగభరిత ట్వీట్

Thursday, October 1st, 2020, 09:47:46 PM IST

అల్లు రామలింగయ్య జయంతి సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి పలు జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. ఈ మేరకు ఆయన జయంతి రోజున పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన పేరు గుర్తుకు రాగానే అందరి పెదాలపై చిరునవ్వు మేదుల్తుంది అని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. మావయ్య గారు కేవలం అందరినీ మెప్పించిన నటుడు మాత్రమే కాదు అని, తియ్యని గుళికల తో వైద్యం చేసే హోమియో పతి వైద్యుడు కూడా అని తెలిపారు. స్వాతంత్య్ర సమరయోధుడు అని, తత్వవేత్త అని, గురువు అని మెగాస్టార్ చిరంజీవి పేర్కొన్నారు.అన్నిటికీ మించి మంచి మనసున్న మనిషి అని మెగాస్టార్ చిరంజీవి ప్రశంసించారు. ఈ 99 వ పుట్టిన రోజు నాడు ఆయన్ని స్మరిస్తూ, వచ్చే సంవత్సరం ఆయన శత జయంతి వేడుక ఆయన జీవితాన్ని, జీవన విధానం ను ఆవిష్కరిస్తుంది అని ఆశిస్తున్నా అంటూ మెగాస్టార్ చిరంజీవి పేర్కొన్నారు.