అభిమానులకు నా కృతజ్ఞతలు.. మెగస్టార్ ఎమోషనల్ ట్వీట్..!

Tuesday, September 22nd, 2020, 04:00:46 PM IST

Chiranjeevi

తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ చెరిగిపోని ముద్ర వేసుకున్న మెగస్టార్ చిరంజీవి ప్రస్థానానికి నేటితో 42ఏళ్ళు నిండిపోయాయి. స్వయంకృషి, స్వీయ ప్రతిభతో అంచెలంచెలుగా ఎదిగిన చిరంజీవి తన నటన, డ్యాన్స్, ఫైట్లతో ట్రెండ్ సెట్ చేశాడు. అయితే ఆయన సినీ ప్రస్థానానికి 42 ఏళ్లు పూర్తైయిన సందర్భంగా చిరంజీవి భావోద్వేగ ట్వీట్ చేసారు.

నా జీవితంలో ఆగస్ట్‌ 22 కి ఎంత ప్రాముఖ్యత ఉందో, సెప్టెంబర్‌ 22 కి కూడా అంతే ప్రాముఖ్యత ఉందని అన్నారు. ఆగష్టు 22 నేను మనిషిగా ప్రాణం పోసుకున్న రోజైతే, సెప్టెంబర్‌ 22 నటుడిగా “ప్రాణం (ఖరీదు) “పోసుకొన్న రోజు నా తొలి చిత్రం విడుదలైన రోజు అని అన్నారు. నన్ను ఇంతగా ఆదరించి ఈ స్థాయికి చేర్చిన సినీ ప్రేక్షక్షులందరికి, ముఖ్యంగా నా ప్రాణానికి ప్రాణమైన నా అభిమానులందరికి ఈ సందర్బంగా మనస్సూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అని చిరంజీవి ఎమోషనల్ పోస్ట్ పెట్టారు.