నాగబాబు పుట్టినరోజున చిరు ఎమోషనల్ ట్వీట్

Thursday, October 29th, 2020, 08:17:26 PM IST

మెగా ఫ్యామిలీ లో నేడు పుట్టిన రోజు జరుపుకుంటున్న నటుడు, నిర్మాత, జన సేన పార్టీ నాయకుడు నాగబాబు కి అన్నయ్య చిరంజీవి సోషల్ మీడియా ద్వారా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. నమ్మకమైన, ఎమోషనల్, దయగల, హృదయ పూర్వక మరియు ప్రియమైన నాగబాబు కి పుట్టిన రోజు శుభాకాంక్షలు అంటూ చిరు ఎమోషనల్ ట్వీట్ చేశారు. ఈ ఏడాది గొప్పగా సాగాలి అంటూ తెలిపారు. మన బంధం, అనుబంధం ఎప్పటికీ ఇలాగే కొనసాగాలని, నీ ప్రతి పుట్టిన రోజు కి అది మరింత బలపడాలి అని ఆశిస్తున్నాను అని తెలిపారు. అయితే పవన్ కళ్యాణ్,చిరు మరియు నాగబాబు ముగ్గురు కలిసిన ఫోటో ను జత చేస్తూ చిరు చేసిన పోస్ట్ సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

మెగాస్టార్ చిరంజీవి చేసిన ట్వీట్ కి మెగా అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. హ్యాపీ బర్త్ డే నాగబాబు అంటూ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇటు బుల్లితెర పై నాగబాబు జడ్జి గా అలరిస్తుండగా, ఇటు మెగాస్టార్ వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ సైతం రాజకీయాల్లో చురుగ్గా ఉంటూనే, వరుస సినిమాలకి ఓకే చెప్తున్నారు.