డియర్ సంజయ్ భాయ్… మీరు ఓ ఫైటర్ – మెగాస్టార్ చిరంజీవి!

Thursday, August 13th, 2020, 12:19:20 AM IST


బాలీవుడ్ అగ్ర నటుడు అయిన సంజయ్ దత్ కి లంగ్ క్యాన్సర్ 3 వ స్టేజి అని వైద్యులు నిర్ధారించినప్పటి నుండి అభిమానులు ఎంతగానో ఆందోళన చెందుతున్నారు. సోషల్ మీడియా లో సైతం అభిమానులు తమ అభిమాన నటుడు సంజయ్ దత్ ఈ ప్రమాదకర క్యాన్సర్ భారీ నుండి త్వరగా బయట పడాలి అంటూ ప్రార్థనలు చేస్తున్నారు. అయితే తాజాగా సంజయ్ అనారోగ్యం తెలుసుకున్న టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి విచారం వ్యక్తం చేస్తూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

డియర్ అంటూ సంబోధిస్తూ, డియర్ సంజయ్ భాయ్, మీరు ఇంతటి అనారోగ్య పరిస్థితులతో పోరాడుతున్నారు అన్న వార్త నన్ను తీవ్రం గా కలచి వేస్తుంది అని చిరు వ్యాఖ్యానించారు.కానీ మీరు ఓ ఫైటర్ అంటూ దైర్యం నింపారు. ఎన్నో ఏళ్లుగా ఒడిదుడుకులను చూశారు అని, వాటిని అధిగమించిన విషయాన్ని గుర్తు చేశారు.అలానే ప్రాణాంతక వ్యాధి నుండి త్వరలో కోలుకుంటారు అనడం లో ఎటువంటి సందేహం లేదు అని ధీమా వ్యక్తం చేశారు.అంతేకాక ఈ వ్యాధి నుండి తప్పక బయట పడతారు అని ఆశిస్తున్నాను అని తెలిపారు. అంతేకాక.మీరు త్వరలో కోలుకొని పూర్తి ఆరోగ్యంతో తిరిగి వస్తారని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నా అంటూ మెగాస్టార్ చిరంజీవి చాలా ఎమోషనల్ అయ్యారు. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి.