అద్దిరిపోయిన మెగాస్టార్ చిరంజీవి ఆచార్య ఫస్ట్ లుక్!

Saturday, August 22nd, 2020, 04:44:38 PM IST

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఆచార్య చిత్రం ఫస్ట్ లుక్ మరియు మోషన్ పోస్టర్ విడుదల అయింది. చిత్ర యూనిట్ ఈ ఫస్ట్ లుక్ ను మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేశారు. ఈ చిత్రం లో చిరు దేవాదాయ శాఖ లో జరిగే అవినీతి పై పోరాడే ఉద్యోగి గా కనిపించనున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదల తో మెగా అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం పై అభిమానులు భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ చిత్రం లో రామ్ చరణ్ సైతం ఒక కీలక పాత్ర పోషిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ చిత్రానికి సంగీతం మణిశర్మ అందిస్తుండగా, కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది.