సాయి ధరమ్ తేజ్ సినిమా కి చిరు బెస్ట్ విషెస్

Wednesday, December 23rd, 2020, 03:21:19 PM IST

మెగా కాంపౌండ్ నుండి వచ్చిన యంగ్ అండ్ డైనమిక్ హీరో సాయి ధరమ్ తేజ్. వరుస విజయాలతో దూసుకుపోతున్న ఈ హీరో మరొక ఫుల్ లెంగ్త్ ఎంటర్టైన్మెంట్ అందించేందుకు సిద్దంగా ఉన్నారు. సాయి ధరమ్ తేజ్ హీరో గా సోలో బ్రతుకే సో బెటర్ అంటూ ఒక సినిమా చేసిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం క్రిస్మస్ పండుగ రోజున థియేటర్ల లో విడుదల అయ్యేందుకు సిద్దంగా ఉంది. ఈ మేరకు మెగాస్టార్ చిరంజీవి ఈ చిత్రం కి బెస్ట్ విషెస్ తెలుపుతూ ఒక సందేశాన్ని విడుదల చేశారు.

ఈ క్రిస్మస్ కి విడుదల అవుతున్న సోలో బ్రతుకే సో బెటర్ టీమ్ అందరికీ శుభాకాంక్షలు అని మెగాస్టార్ చిరంజీవి తెలిపారు. లాక్ డౌన్ తర్వాత విడుదల అవుతున్న తొలి చిత్రం గా ఇది మొత్తం ఫిల్మ్ ఇండస్ట్రీ కే ఒక ముఖ్యమైన సందర్భం అని అన్నారు. ఈ చిత్రానికి లభించే ఆదరణ మొత్తం చిత్ర పరిశ్రమ లోనే ఒక స్పూర్తి ను స్థైర్యాన్ని కలిగిస్తుంది అని అనడం లో సందేహం లేదు అని తెలిపారు. అలానే ప్రేక్షకులు అందరూ బాధ్యతగా ఫేస్ మాస్క్ లు ధరించి సోషల్ దిస్తాన్సింగ్ పాటిస్తూ ఈ చిత్రాన్ని ఎంజాయ్ చేయాల్సింది గా కోరుతున్నాను అని చిరు తెలిపారు.