మీ ఇద్దరూ ఇంకెందరికో స్ఫూర్తి – చిరంజీవి

Wednesday, January 6th, 2021, 09:18:55 AM IST

ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ డీఎస్పీ కి సెల్యూట్ చేయడం మామూలు. కాకపోతే సర్కిల్ ఇన్స్పెక్టర్ తన కూతురిని కష్టపడి చదివించి, ఇప్పుడు ఆ కూతురికి సెల్యూట్ చేశారు. ఆంధ్ర ప్రదేశ్ పోలీస్ ఫస్ట్ డ్యూటీ మీట్ లో జరిగిన ఒక సంఘటన ప్రతి ఒక్కరికీ ఆదర్శంగా, గర్వకారణం గా నిలిచింది. సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్యామ్ సుందర్, తన కూతురు జెస్సీ ప్రశాంతి కి సెల్యూట్ చేశారు. డీఎస్పీ హోదా లో ఉన్న కూతురికి సెల్యూట్ చేస్తూ ఉన్న ఫోటో ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. అయితే ఇదే విషయం పై ప్రముఖ టాలీవుడ్ నటుడు, మెగాస్టార్ చిరంజీవి స్పందించారు.

ఈ ఫొటోలో ఉంది తండ్రి కూతురు, తండ్రి సి ఐ శ్యామ్ సుందర్ గారు, కూతురు డిఎస్పీ మిస్ జెస్సీ ప్రశాంతి అంటూ మెగాస్టార్ చిరంజీవి పేర్కొన్నారు. తన గుండెల మీద ఎత్తుకొని పెంచిన బిడ్డ, తన పై అధికారిగా వచ్చినప్పుడు ఆ తండ్రి చేసిన సెల్యూట్ లో బోల్డంత సంతృప్తి ను, ప్రేమను చూసాను అంటూ చెప్పుకొచ్చారు. శ్యామ్ సుందర్ గారు ఐ సెల్యూట్ యూ, మీ ఇద్దరూ ఇంకేందరికో ఆదర్శం అంటూ మెగాస్టార్ చిరంజీవి అన్నారు. చిరు చేసిన ట్వీట్ సైతం సోషల్ మీడియా లో వైరల్ అవుతోంది.