ప్రభాస్‌కి సారీ చెప్పేసిన సాయిధ‌ర‌మ్ ‌తేజ్..!

Sunday, August 23rd, 2020, 02:33:08 PM IST

Sai-Dharam-Tej

మెగా హీరో సాయిధ‌ర‌మ్ తేజ్ పెళ్ళి పీటలు ఎక్కబోతున్నారు. ఈ లాక్‌డౌన్ టైంలోనే హీరోలు నితిన్, నిఖిల్, దగ్గుబాటి రానా వంటి వారు పెళ్ళిలు చేసేసుకున్నారు. అయితే ఇప్పటి వరకు బ్యాచ్‌లర్‌గా ఉన్న సాయిధ‌ర‌మ్ తేజ్ తాను కూడా పెళ్లికి సిద్ధ‌మ‌వుతున్న‌ట్లు సిగ్న‌ల్ ఇచ్చేశారు.

ఒక్కోసారి మ‌నం ఎన్నో అనుకుంటాం కానీ, ఆ టైం వ‌చ్చిన‌ప్పుడు త‌ప్ప‌దు మ‌రి అంటూ ట్విట్టర్‌లో ఓ వీడియోను పోస్ట్ చేశాడు. సింగిల్ ఆర్మీ అనే ఓ బ్యాచ్‌లర్స్ వాట్సాఫ్ గ్రూప్ నుంచి నిఖిల్, నితిన్, రానా ఒక్కొక్కరు లెఫ్ట్ అవుతూ వచ్చారు. అయితే ఇప్పుడు ప్రభాస్ అన్నా సారీ ఇప్పుడు నా వంతు వచ్చేసింది అంటూ ఆ గ్రూప్ నుంచి సాయిధ‌ర‌మ్ ‌తేజ్ కూడా లెఫ్ట్ అయిపోయారు. అయితే అసలు పెళ్ళి ఎప్పుడు, పెళ్ళి కూతురు ఎవరు అనే దానిపై రేపు ఉదయం 10 గంటలకు క్లారిటీ ఇవ్వబోతున్నట్టు తెలుస్తుంది.