చిరంజీవి 150వ సినిమాకి బాహుబలి భయం పట్టుకోనుందా..!

Wednesday, June 15th, 2016, 01:39:55 PM IST


ప్రస్తుతం టాలీవుడ్ పరిశ్రమలో అందరి దృష్టీ రెండే రెండు సినిమాలపై ఉంది అది ఒకటి బాహుబలి – 2, రెండు మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా. ఈ రెండు కూడా పెద్ద క్రేజీ ప్రాజెక్టులు. బాహుబాలి టీమ్ ఈసారి బాహుబలి – 2తో పాత రికార్డులను బ్రేక్ చెయ్యాలని చూస్తున్నారు. అలాగే మెగా అభిమానులు సైతం 9 ఏళ్ల తరువాత చిరు రీ ఎంట్రీ ఇవ్వబోయే సినిమా ఇప్పటి వరకూ ఉన్న మైల్ స్టోన్ బాహుబలి రికార్డులను బ్రేక్ చెయ్యాలని భావిస్తున్నారు. దీంతో ఈ రెండు సినిమాల మధ్య గట్టి పోటీ మొదలైంది.

ఇక్కడ చూస్తే బాహుబలికి రాజమౌళి, సినిమా మేకింగ్, అంతజాతీయ మార్కెట్ ప్లస్ పాయింట్లయితే చిరంజీవి 150 వ సినిమాకి చిరంజీవి చరీష్మ, మెగా అభిమానుల ఆతురత, సినీ జనాల అభిమానం కలిసొచ్చే అంశాలు. కానీ బాహుబలి రికార్డులను బ్రేక్ చెయ్యడమంటే సామాన్యమైన విషయం కాదు. అయినప్పటికీ మెగా అభిమానులు అబ్బే అవేం కుదరవు బ్రేక్ అవ్వాల్సిందే అనే మాట మీదే ఉన్నారు. దీంతో ఈ సినిమా పై ఖచ్చితంగా అభిమానుల ఆశల ఒత్తిడి, బాహుబలి రికార్డుల భారం రెండూ పడే అవకాశం ఉంది.