ఒకే ఫ్రేమ్‌లో మెగా హీరోల సంక్రాంతి సందడి.. పిక్ వైరల్..!

Wednesday, January 15th, 2020, 06:50:10 PM IST

సంక్రాంతి పండుగ రోజున మెగా అబిమానులకు డబుల్ ధమకా కనిపించింది. ఒక పక్క మెగా ఫ్యామిలీ హీరో అల్లు అర్జున్ నటించిన అలవైకుంఠపురంలో మంచి సక్సెస్ టాక్ అందుకోగా, నేడు మెగా హీరోలంతా ఓకే చోట కనిపించడంతో మెగా అభిమానులు ఎంతో సంబరపడిపోతున్నారు.

మెగా ఫ్యామిలీ హీరోలంతా ఈ సంక్రాంతి పండగను చిరంజీవి ఇంట్లో జరుపుకున్నారు. అయితే మెగాస్టార్ చిరంజీవితో పాటు , రామ్ చరణ్, వరుణ్‌ తేజ్‌, వైష్ణవ్ తేజ్, సాయిధరమ్‌ తేజ్‌, చిరంజీవి అల్లుడు కల్యాణ్‌ దేవ్, అల్లు అర్జున్‌, అల్లు శిరీష్‌లతో పాటుగా పవన్‌ కల్యాణ్‌, రేణుదేశాయ్‌ల కుమారుడు అకీరా నందన్‌ కూడా ఉండడంతో ఈ పిక్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఒకే ఫ్రేమ్‌లో మెగా హీరోలంతా కనిపించడంతో మెగా అభిమానులు కూడా ఆ ఫోటోను తెగ షేర్లు చేస్తూ, లైక్‌లు కొడుతున్నారట.