నమితపై మీడియా టార్గెట్?

Thursday, February 19th, 2015, 05:45:00 PM IST

namitha
ప్రముఖ నటి నమితకు ఇటీవల సినిమాలు పెద్దగా లేకపోయినప్పటికీ ఆమెకు ఉన్న క్రేజు మాత్రం ఏమాత్రం తగ్గలేదు. అయితే ఈ మధ్య తనను మీడియా పదేపదే టార్గెట్ చేస్తోందంటూ నమిత ఆవేదన వ్యక్తం చేశారు. కాగా తనకు ఇటీవల అవకాశాలు తగ్గి వివాహానికి సిద్ధమైనట్లు మీడియాలో వచ్చిన కథనాలను నమిత కొట్టిపడేశారు. అలాగే తాను సమాజసేవ చేసేందుకు నిర్ణయించుకున్నానని నమిత స్పష్టం చేశారు.

ఇక తాజాగా సూరత్ లో జరగనున్న ఒక సాంస్కృతిక కార్యక్రమంలో పాల్గొనడానికి నమిత అంగీకరించగా ఆమె మేనేజర్ పారితోషకంతో పరారైన వార్తలను ఆమె ఖండించారు. అలాగే తాను ఎలాంటి సాంస్కృతిక కార్యక్రమంలో పాల్గొనడానికి అంగీకరించలేదని, తనపై అసత్య ప్రచారాలు జరుగుతున్నాయని నమిత వాపోయారు. ఇక తనపై కావాలనే ఎవరో వదంతులను పుట్టిస్తున్నారని, ఇలాంటి అసత్య ప్రచారాలను ఎవరు, ఎందుకు చేస్తున్నారో అర్ధం కావడంలేదని నమిత ఆవేదన వ్యక్తం చేశారు.