తండ్రి పొలిటికల్ ఎంట్రీ పై విష్ణు షాకింగ్ కామెంట్స్ ?

Thursday, April 28th, 2016, 03:28:24 PM IST


మంచు మోహన్ బాబు సినిమా పరిశ్రమలో తిరుగులేని ఇమేజ్ ని సొంతం చేసుకున్న నటుడు. కొన్నాళ్ళు రాజకీయాల్లో ఉన్న అయన స్వతహాగా వాటికి రామ్ రామ్ చెప్పి మల్లి సినిమాలు చేసుకుంటున్న మోహన్ బాబు తిరిగి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తానని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ విషయం పై అయన తనయుడు మంచు విష్ణు స్పందిస్తూ .. నాన్నగారు రాజకీయాల్లోకి వెళ్ళడం మాకు అస్సలు ఇష్టం లేదని, ఇప్పుడున్న రాజకీయాల్లో అయన ఇమడలేరని అంటున్నాడు. అయన జడ్జిమెంట్ కరెక్ట్ గా ఉంటుందని నా సినిమా కథలు ముందు విని దాని జడ్జిమెంట్ గురించి ముందే చెప్పేస్తారని చెప్పారు. మరి వాళ్ళ అబ్బాయి మాట విని మోహన్ బాబు రాజకీయాల్లోకి రావడం మానుకుంటారో .. లేదా ఎంట్రీ ఇస్తాడో చూడాలి !!