‘అహం బ్రహ్మాస్మి’ అంటూ రీ ఎంట్రీ ఇస్తున్న మంచు మనోజ్..!

Thursday, February 13th, 2020, 05:46:36 PM IST


కొద్ది రోజుల క్రితం ఒక అదిరిపోయే అప్డేట్ ఇస్తానని చెప్పిన మంచు మనోజ్ ఎట్టకేలకు అదేంటో చెప్పేశాడు. దాదాపు మూడేళ్ళు సినిమాలకు దూరంగా ఉన్న మంచు మనోజ్ ఎట్టకేలకు మళ్ళీ సినిమాలలోకి రీ ఎంట్రీ ఇస్తున్నట్టు అఫిషియల్‌గా ప్రకటించేశాడు. 2017లో రిలీజైన ఒక్కడు మిగిలాడు సినిమా తరువాత మళ్ళీ మంచు మనోజ్ ఏ సినిమాలు చేయలేదు.

అయితే తాజాగా ‘అహం బ్రహ్మాస్మి’ అనే సినిమా ద్వారా మళ్ళీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు మంచు మనోజ్. శ్రీకాంత్ ఎన్ రెడ్డి అనే కొత్త దర్శకుడు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా, తన తల్లి నిర్మల దేవితో కలిసి మంచు మనోజ్ ఈ సినిమాని నిర్మిస్తున్నాడు. అయితే ఈ సినిమాని మొత్తం అయిదు భాషలలో రిలీజ్ చేయనున్నారు. దాదాపు మోడేళ్ళ గ్యాప్ తరువాత రీ ఎంట్రీ ఇచ్చిన మంచు మనోజ్‌కు ఈ సినిమా సక్సెస్‌ని ఇస్తుందా లేదా అనేది చూడాలి మరీ.