బిగ్ వైరల్: రకుల్ ప్రీత్‌కు మంచు లక్ష్మీ సెటైర్..!

Wednesday, December 23rd, 2020, 12:00:36 AM IST

కరోనా వైరస్ మహమ్మారి ఏ ఒక్కరినీ విడిచి పెట్టడం లేదు. తాజాగా టాలీవుడ్ టాప్ హీరోయిన్లలో ఒకరైన రకుల్ ప్రీత్ సింగ్ కూడా కరోనా వైరస్ బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆమెనె స్వయంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. తనకి కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయ్యిందని, త్వరలోనే కోలుకొని మళ్ళీ తాను సినిమా షూటింగ్‌లలో పాల్గొంటానని చెప్పుకొచ్చింది. అయితే ఇదంత బాగానే ఉన్నా రకుల్ ప్రీత్‌కు పాజిటివ్ రావడంపై మంచులక్ష్మీ సెటైర్ వేసింది.

తనకు కరోనా పాజిటివ్ వచ్చిందని, హోం ఐసోలేషన్‌లో ఉంటున్నటు రకుల్ ప్రీత్ ట్వీట్ చేయగా దీనిపై మంచు లక్ష్మీ సరదాగా స్పందిస్తూ నీకు పాజిటివ్ నాకు నెగిటివ్ అని ఈ ఏడాది మోస్ట్ నెగిటివ్ పర్సన్ నేనే అని ఫన్నీగా కామెంట్ చేసింది. అయితే దీనికి సమాధానంగా రకుల్ కూడా నవ్వుతూ ఇప్పుడే కాదు ఎప్పుడూ నెగిటివ్‌గా ఉండాలని కోరుకుంటున్నానని చెప్పింది. అయితే ప్రస్తుతం ఈ ట్వీట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.