ఆచార్యలో మెయిన్ ఎమోషన్ ఏంటో చెప్పేసిన కొరటాల శివ..!

Tuesday, May 25th, 2021, 02:00:08 AM IST

మెగస్టార్ చిరంజీవి హీరోగా సక్సెస్‌ ఫుల్‌ చిత్రాల దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఈ సినిమా షూటింగ్ ఆగిపోయింది. అయితే ఆగష్ట్ నెలలో కనుక కరోనా ఉదృత్తి తగ్గి థియేటర్లు తెరుచుకుంటే ఈ సినిమాను ఆ నెలలో రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే తాజాగా ఈ సినిమాపై దర్శకుడు కొరటాల శివ ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మరో 10 రోజలు షూటింగ్ చేస్తే ఈ సినిమా షూటింగ్ అయిపోతుందని చెప్పుకొచ్చారు.

అయితే ఈ సినిమాలో మెగాపవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ కూడా సిద్ద అనే కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే తొలిసారి రామ్‌ చరణ్‌ పాత్రపై నోరు విప్పిన కొరటాల ఈ సినిమాలో మెయిన్ ఎమోషన్ మొత్తం రామ్ చరణ్ పాత్ర చుట్టూనే తిరుగుతోందని క్లారిటీ ఇచ్చారు. రామ్ చరణ్ ఏదో చేయాలనుకొని ఏమీ చేయాలేకపోయాడో దానినే ఆచార్యగా చిరంజీవి ఎలా కొనసాగించాడనేదే సినిమా కథ అని అన్నాడు. ఈ సినిమాలో మెగాస్టార్ ఎండోమెంట్స్ విభాగానికి చెందిన అధికారిగానే కనిపిస్తారని అయితే ఆ పాత్ర కేవలం పది నిముషాలు మాత్రమే ఉంటుందని కొరటాల చెప్పుకొచ్చారు.