రాజమౌళి సినిమా తర్వాత త్రివిక్రమ్ సినిమాకు రెడీ అవుతున్న మహేశ్?

Monday, September 7th, 2020, 01:06:58 PM IST

సూపర్ స్టార్ మహేశ్ బాబు రాజమౌళి కాంబినేషన్‌లో సినిమా అనౌన్స్ అయ్యి చాలా రోజులు గడుస్తున్నా అది ఇంకా పట్టలెక్కలేదు. అయితే ఆర్ఆర్ఆర్ సినిమా తరువాత రాజమౌళి మహేశ్‌తో ఖచ్చితంగా సినిమా చేయబోతున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ సినిమా తరువాత మహేశ్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో కలిసి సినిమా చేస్తున్నట్టు ఫిల్మ్ సర్కిల్‌లో ప్రచారం జరుగుతుంది. అయితే వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చే సినిమాను జీ. మహేశ్ బాబు ఎంటర్‌టైన్‌మెంట్స్ మరియు హారిక అండ్ హాసిని క్రియేషన్స్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నట్టు టాక్.

అయితే వీరిద్దరి కాంబినేషన్‌లో ఇప్పటికే అతడు, ఖలేజా సినిమాలు వచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం మహేశ్ బాబు గీతగోవిందం ఫేమ్ పరశురామ్ దర్శకత్వంలో సర్కార్ వారి పాట సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్‌కి విపరీతమైన క్రేజ్ లహించింది.