లాంఛనంగా స్టార్ట్ అయిన సర్కార్ వారి పాట షూటింగ్..!

Saturday, November 21st, 2020, 09:48:37 PM IST

ఈ ఏడాది సరిలేరు నీకెవ్వరు సినిమాతో భారీ హిట్ కొట్టిన మహేష్ బాబు తాజాగా దర్శకుడు పరుశురాం దర్శకత్వంలో సర్కార్ వారి పాట సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. అయితే కరోనా కారణంగా షూటింగ్ వాయిదా పడడంతో మొన్నటి వరకు ఇంట్లోనే ఉన్న మహేశ్ ఇటీవల ఫ్యామిలీతో కలిసి వెకేషన్‌కి కూడా వెళ్లొచ్చాడు.

అయితే ఇప్పుడిప్పుడే పలు సినిమాలు తిరిగి షూటింగ్ ప్రారంభించుకోవడంతో, సర్కార్ వారి పాట సినిమా యూనిట్ కూడా షూటింగ్‌కి రెడీ అయ్యింది. నేడు కేపీహెచ్‌బీలోని కాశీ విశ్వనాథ స్వామి టెంపుల్‌లో చిత్ర యూనిట్ పూజా కార్యక్రమాలను జరుపుకుంది. మహేష్ బాబు కూతురు సితార క్లాప్ కొట్టగా, నమ్రత మహేష్ కెమరా స్విచ్ ఆన్ చేశారు. అయ్తే జనవరి మొదటివారం నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానున్నట్టు తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో మహేశ్ సరసన కీర్తి సురేశ్ నటిస్తుండగా, తమన్ సంగీతం అందిస్తున్నారు.