సర్కారు వారి పాట అంతకుమించి ఉండనుందా?

Wednesday, January 20th, 2021, 09:48:58 AM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న సర్కారు వారి పాట చిత్రీకరణ శరవేగంగా జరుపుకుంటోంది. అయితే కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా మొత్తం కూడా బ్యాంకింగ్ రంగంలో జరిగే ఆర్ధిక నేరాలను కీలకం గా చూపించ నున్నారు. అయితే ఇటీవల ఈ చిత్రం హాట్ టాపిక్ గా మారింది. సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాల్లోకి వచ్చి చాలా ఏళ్లు గడుస్తున్నా ఇప్పటి వరకూ కూడా పాన్ ఇండియా మూవీ పై దృష్టి సారించలేదు. అయితే మన తెలుగు హీరోలు కూడా పాన్ ఇండియా చిత్రాలు చేస్తుండటం తో దర్శక నిర్మాతలు సైతం ఇదే తరహాలో ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది.

అయితే సర్కారు వారి పాట చిత్రం లో యాక్షన్ సన్నివేశాలు కీలకం కానున్నాయి. ఈ చిత్రాన్ని దేశ వ్యాప్తంగా విడుదల చేసే అవకాశం కూడా ఉందని తెలుస్తోంది. అయితే మహేష్ బాబు రాజమౌళి కలయిక లో ఒక సినిమా రానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కి ముందుగా మహేష్ తన మార్కెట్ ను మరింత గా పెంచుకొనే ఆలోచన లో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే బాలీవుడ్ కి ధీటుగా సర్కారు వారి పాట కంటెంట్ ఉంటుంది అని ఫిల్మ్ నగర్ లో చర్చలు మొదలు అయ్యాయి. ఈ చిత్రం తో మహేష్ పాన్ ఇండియా హీరో గా మారతాడో లేదో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.