సూపర్ స్టార్ మహేశ్ బాబు ఇన్స్టాలో సత్తా చాటుతున్నాడు. ఈ మధ్య ప్రిన్స్ మహేశ్ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటున్నాడు. దీంతో ఇన్స్టాగ్రామ్లో మహేష్ అక్షరాలా ఆరు మిలియన్ల మార్క్ టచ్ చేశారు. మహేశ్ బాబును ఫాలో అవుతున్న వారి సంఖ్య 6 మిలియన్లకు చేరింది. ఇప్పటికే ట్విట్టర్లో 10.9 మిలియన్ల ఫాలోవర్లతో అత్యధిక అనుచరులు కలిగిన దక్షిణాది నటుడిగా రికార్డ్ సాధించాడు.
ఇదిలా ఉంటే మహేష్ తాజాగా నటిస్తున్న సర్కారు వారి పాట సినిమా ఇటీవలే పూజా కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. పరశురామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మహేశ్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ ఫస్ట్ షెడ్యూల్ త్వరలో అమెరికాలో స్టార్ట్ కానుంది.