నెట్ ఫ్లిక్స్ “డార్క్” వెబ్ సిరీస్ ను చూడమంటున్న సూపర్ స్టార్ మహేష్!

Wednesday, July 8th, 2020, 11:25:07 PM IST


సూపర్ స్టార్ మహేష్ బాబు లాక్ డౌన్ సమయం నుండి ఇంట్లోనే ఉంటూ తాను చేస్తున్న పనులను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటున్నారు. ఇప్పటికే మహేష్ బాబు కుమారుడు మరియు కుమార్తె లతో తాను గడుపుతున్న సంతోష క్షణాలను సైతం కొన్ని షేర్ చేసుకున్నారు. అయితే పుస్తకాలతో, సినిమా లతో, వెబ్ సిరీస్ లతో చాలా మంది ఈ కరోనా వేళ రిలాక్స్ అవుతున్నారు. అయితే మహేష్ సైతం తాజాగా ఒక వెబ్ సిరీస్ ను చూసినట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించిన ఒక పోస్ట్ ఇపుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

ఇప్పటికే నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతున్న డార్క్ ఒరిజినల్ సిరీస్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంతుంది. అయితే తాజాగా మహేష్ బాబు సైతం ఈ లిస్ట్ లో చేరిపోయారు. చాలా అద్భుతంగా ఉంది అని, జర్మన్ వెర్షన్ ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో చూడాలని అందరినీ కోరారు. అయితే మహేష్ బాబు పలు తెలుగు సినిమాల పై ఇలా ప్రశంసలు కురిపించగా మొదటి సారి ఒక వెబ్ సిరీస్ పై ఇలా వ్యాఖ్యలు చేశారు. పలువురు అభిమానులు, చూడని వారు డార్క్ వెబ్ సిరీస్ ను చూసేందుకు ఇపుడు ఆసక్తి కనబరుస్తున్నారు.