అభిమాని సజేషన్: శేఖర్ మాస్టర్‌కి మహేష్ బాబు బంఫర్ ఆఫర్..!

Wednesday, January 15th, 2020, 07:23:36 PM IST

సూపర్ స్టార్ మహేశ్ బాబు తాజాగా నటించిన చిత్రం సరిలేరు నీకెవ్వరు. ఈ సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మంచి బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. తొలి మూడు రోజులలోనే 100 కోట్ల షేర్ వసూల్ చేసి బాక్సాఫీస్ వద్ద భారీగా కలెక్షన్లను రాబడుతుంది. అయితే ఈ సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుండడంతో చిత్ర యూనిట్ రోజుకొక ప్రమోషన్ వీడియోలను బయటకు వదులుతుంది.

అయితే తాజాగా సోషల్‌ మీడియా వేదికగా ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలను అనిల్ రావిపూడి మహేశ్‌కి చదివి వినిపించాడు. అయితే అభిమానులు అడిగిన ప్రశ్నలకు మహేశ్ చాలా చక్కగా సమాధానమిచ్చాడు. అయితే ఈ సినిమాలో మైండ్ బ్లాంక్ పాటకి చాలా క్రేజ్ వచ్చిందని ఇప్పటికే మహేశ్ కూడా ఒప్పుకున్నాడు. అయితే ఒక అభిమాని ఈ సినిమాలో మైండ్‌ బ్లాక్‌ సాంగ్‌కు శేఖర్‌ మాస్టర్‌ డ్యాన్స్‌ బాగా కంపోజ్‌ చేశారని, ఇక నుంచి మీ ప్రతి సినిమాకు శేఖర్ మాస్టర్‌నే కొరియోగ్రాఫర్‌గా పెట్టుకోవాలని మహేశ్‌కు సజేషన్ చేశాడు. అయితే అభిమాని సజేషన్ మేరకు ఇక నుంచి తప్పకుండా తన సినిమాలో కనీసం రెండు పాటలకు శేఖర్‌ మాస్టర్‌తోనే కంపోజ్ చేయించుకుంటానని మహేశ్ చెప్పాడు. అయితే అభిమాని కోరికను తీర్చడమే కాకుండా అటు శేఖర్ మాస్టర్‌కి కూడా మహేశ్ బంఫర్ ఆఫర్ ఇచ్చాడనే చెప్పాలి.