వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో మహేష్, పవన్ సినిమాలు!

Sunday, February 28th, 2021, 07:18:42 PM IST

తెలుగు సినీ పరిశ్రమ లో పాన్ ఇండియా సినిమా లేకుండా నే తెలుగు ప్రేక్షకుల మదిలో సుస్థిర స్థానం సంపాదించుకున్న ఇద్దరు టాలీవుడ్ బిగ్ హీరోస్ ఎవరైనా ఉన్నారు అంటే అది పవన్ కళ్యాణ్ మరియు మహేష్ బాబు అని చెప్పాలి. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమా లు చేస్తూ బిజీగా ఉన్నారు. వకీల్ సాబ్ ఈ ఏడాది ఉగాది పండుగ కి విడుదల కానున్న సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం అయ్యప్పనుం కోషియం చిత్ర రీమేక్ లో, క్రిష్ దర్శకత్వం లో నటిస్తూ బిజీగా ఉన్నారు పవన్ కళ్యాణ్. అదే విధంగా సూపర్ స్టార్ మహేష్ బాబు పరశురామ్ దర్శకత్వం లో సర్కారు వారి పాట చిత్రం లో నటిస్తున్నారు. అయితే ఇది వరకే ఈ చిత్రాన్ని సంక్రాతికి విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించిన సంగతి అందరికీ తెలిసిందే.

అయితే దర్శకుడు క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న pspk 27 చిత్రం కూడా వచ్చే ఏడాది సంక్రాంతి కి విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించేసింది.అయితే గతం లో క్రిష్ సినిమా లు సంక్రాంతి కి విడుదల అయిన సంగతి తెలిసిందే. క్రిష్ మరొకసారి పవన్ కళ్యాణ్ తో తీస్తున్న చిత్రాన్ని సంక్రాంతి కి విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ రాబోయే సినిమాల్లో ప్రేక్షకులు కాస్త ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్న చిత్రాల్లో ఇదే ముందు వరుసలో ఉంటుందీ అని చెప్పాలి. అయితే ఈ చిత్రం మహష్ సర్కారు వారి పాట సంక్రాంతి కి విడుదల కావడం పట్ల అటు అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.