అక్కడ అల్లు అర్జున్ కి అనుమతి ఇవ్వడం ఏంటి?

Sunday, September 13th, 2020, 04:32:55 PM IST

కరోనా వైరస్ విపత్తు కారణం గా ప్రపంచ దేశాలు భయాందోళన చెందుతున్నాయి. అయితే ఇప్పటికే లాక్ డౌన్ అమలు చేసినప్పటికీ భారీ స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. అయితే మన తెలుగు రాష్ట్రాల్లో సైతం కరోనా వైరస్ విజృంభించదాంతో పలు చోట్ల అనుమతులు రద్దు చేశారు. ముఖ్యంగా పర్యాటక ప్రాంతాలు కూడా రద్దులోనే ఉన్నాయి. అయితే తాజాగా అల్లు అర్జున్ కుంటాల జలపాతాన్ని కుటుంబ సభ్యులతో కలిసి సందర్శించారు.

అక్కడి అందాలను తిలకించారు. అయితే అక్కడి అటవీ శాఖ అధికారులు అక్కడి ప్రాంతం గురించి, వాటి ప్రాముఖ్యత గురించి వివరించారు. అలానే అదిలాబాద్ పట్టణ శివారు లో హరితవసం పార్క్ లో సఫారీ లో తిరుగుతూ, అక్కడి అందాలని తిలకించారు. అయితే అల్లు అర్జున్ కి అనుమతి ఇవ్వడం పట్ల స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల దిల్ రాజు నీ సైతం అనుమతించారు. అయితే పర్యాటకులను అనుమతించని అధికారులు సెలబ్రిటీ లకు అనుమతి ఇవ్వడం పట్ల విమర్శలు చేస్తున్నారు.