విజయ్ “లైగర్” విడుడల తేదీ ను ప్రకటించిన చిత్ర యూనిట్!

Thursday, February 11th, 2021, 10:00:17 AM IST

విజయ్ దేవరకొండ, అనన్య పాండే హీరో హీరోయిన్స్ గా నటిస్తున్న చిత్రం లైగర్. ఈ చిత్రం ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని ఎదురు చూస్తున్న వారందరికీ కూడా చిత్ర యూనిట్ గుడ్ న్యూస్ తెలిపింది. ఈ చిత్రాన్ని ఈ ఏడాది సెప్టెంబర్ 9 న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ను పూరి కనెక్స్ట్ మరియు ధర్మ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా చిత్రం గా విడుదల అవుతున్న ఈ లైగర్ పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఈ చిత్రం విడుదల తేదీ ను విజయ్ దేవరకొండ ప్రకటిస్తూ, తేదీ ఫిక్స్ అయింది అని, మేం వస్తున్నాం అంటూ చెప్పుకొచ్చారు. అయితే ఈ చిత్రం లో విజయ్ బాక్సర్ గా కనిపంచబోతున్నాడు. అర్జున్ రెడ్డి చిత్రం తో టాలీవుడ్ లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న విజయ్ ఇప్పుడు డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో సినిమా చేస్తుండటం తో బాలీవుడ్ లో కూడా ఈ చిత్రం ఎపుడెప్పుడు విడుదల అవుతుందా అంటూ ఎదురు చూస్తున్నారు.