“లైగర్” చిత్రం కోసం ఎదురుచూసే వారికి గుడ్ న్యూస్

Wednesday, February 10th, 2021, 04:00:05 PM IST

విజయ్ దేవరకొండ హీరో గా, అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తున్న లైగర్ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రాన్ని డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కిస్తున్నారు. పూరి కనెక్ట్స్, ధర్మ ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే ఈ చిత్రానికి సాలా క్రాస్ బ్రీడ్ అంటూ ఉప శీర్షిక పెట్టీ అంతకు మించి సినిమా ఉండనుంది అంటూ హింట్స్ ఇచ్చారు పూరి.

అయితే ఇప్పుడు ఈ లైగర్ సోషల్ మీడియాలో టాప్ లో ట్రెండ్ అవుతోంది. ఇప్పటి వరకూ టాలీవుడ్ చిత్ర పరిశ్రమ తో పాటుగా చాలా చిత్ర పరిశ్రమ ల నుండి వస్తున్న, రాబోతున్న సినిమా విడుదల తేదీలను ప్రకటిస్తున్నాయి. అయితే ఈ నేపథ్యం లో లైగర్ చిత్రం కోసం ఎదురు చూస్తున్న వారికి చిత్ర యూనిట్ గుడ్ న్యూస్ తెలిపింది. ఈ చిత్రం విడుదల తేదీ ను ఫిబ్రవరి 11 న ఉదయం 8 గంటల 14 నిమిషాలకు ప్రకటించనున్నారు. అయితే ఈ విషయాన్ని ప్రకటించడం తో సోషల్ మీడియాలో ఫ్యాన్స్ కామెంట్స్, షేర్, లైక్ చేస్తూ విపరీతంగా వైరల్ చేస్తున్నారు. విజయ్ దేవరకొండ యాక్టింగ్, పూరి జగన్నాథ్ దర్శకత్వం లో, పాన్ ఇండియా సినిమా రావడం పట్ల ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అంటూ ఎదురు చూస్తున్నారు.