20 నిమిషాల పాటు వ్యాయామం చేస్తున్న ఎస్పీ బాలు

Monday, September 14th, 2020, 11:05:10 PM IST


ప్రాణాంతమైన కరోనా వైరస్ మహమ్మారి భారీ నుండి కోలుకున్న ప్రముఖ లెజెండరీ సింగర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యం ప్రస్తుతం మెరుగ్గా ఉంది. రోజురోజుకీ కాస్త మెరుగ్గా అవుతూ, కోలుకుంటున్నారు అని ఆయన కుమారుడు ఎస్పీ చరణ్ వీడియో సందేశం ద్వారా వెల్లడించారు.ప్రస్తుతం ఆరోగ్యం మరింతగా మెరుగు పడింది అని తెలిపారు. ఊపిరి తిత్తుల పనితీరు బావుంది అని, ఎక్స్ రే లో కనిపించింది అని తెలిపారు. అయితే ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం 20 నిమిషాల పాటు వ్యాయామం చేస్తున్నట్లు ఎస్పీ చరణ్ తెలిపారు.

అయితే నిరంతరం పర్యవేక్షిస్తూ ఉన్నటువంటి వైద్యులు, ఫిజియోథెరపిస్టులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తో వ్యాయామం చేయిస్తున్నట్లు తెలిపారు. కరోనా వైరస్ భారిన పడి ఆగస్ట్ 5 న చెన్నై లోని ఎంజీఎం లో చేరిన ఎస్పీ బాలు మెల్లమెల్లగా కొలుకుంటూ, కరోనా ను జయించారు. అయితే ఇంకా ఆరోగ్యం మెరుగయ్యేందుకు ఇంకా వెంటిలేటర్ పై ఉంచి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. ఎస్పీ బాలు త్వరగా కోలుకోవాలని అభిమానులు, ప్రముఖులు, సినీ రంగానికి చెందిన ఎంతోమంది ప్రార్థనలు చేశారు.