మహేష్ – రాజమౌళి సినిమా స్టార్ట్ అయ్యేది అప్పుడేనా!?

Friday, October 9th, 2020, 12:23:57 AM IST

Mahesh-Babu---Rajamouli
సూపర్ స్టార్ మహేష్ బాబు రాజమౌళి తో ఒక సినిమా ను చేయనున్న సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రం పై ఎప్పటి నుండి ఎన్నో వార్తల్ వస్తూనే ఉన్నాయి. అయితే తాజాగా ఈ చిత్రం కి సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. జక్కన్న మహేష్ బాబు కలయిక లో రానున్న ఈ సినిమా వచ్చే ఏడాది దసరా పండుగ కి మొదలు కానున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన పూర్తి స్క్రిప్ట్ వర్క్ ను విజయేంద్ర ప్రసాద్ సిద్దం చేస్తున్నట్లు తెలుస్తోంది. మహేష్ తన వరుస ప్రాజెక్ట్ లను వచ్చే ఏడాది కి పూర్తిచేసే లోపు ఈ స్క్రిప్ట్ పూర్తి స్థాయిలో సిద్దం కానుంది.

రాజమౌళి సైతం ప్రస్తుతం రౌద్రం రణం రుధిరం చిత్రం తో బిజీ గా ఉన్నారు. ఈ చిత్రం పూర్తి అయి విడుదల కావడం, ఆ తర్వాత మహేష్ సినిమా కి సంబంధించిన వర్క్ పూర్తి చేసే టైమ్ కి దసరా వచ్చే అవకాశం ఉంది. అయితే దీని పై ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. మహేష్ బాబు ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమా లో నటిస్తూ బిజీగా ఉన్నారు.